సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్
సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించడం యొక్క ముఖ్య ఉద్దేశం మధుమేహం రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులవలన బాధపడుతున్న పేద మధ్యతరగతి ప్రజలు సరైన వైద్యం చేయించుకోలేక, వారికి అవసరమైన మందులను కొనలేని పరిస్థితులను చూసి వారికి ఎంతో కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో రామచంద్రపురం పరిసర ప్రాంతాల సామాన్య దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన నాగిరెడ్డి వెంకన్న వారి సన్నిహితులు కలిసి సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించడం జరిగింది.
మా గురించి
పేద ప్రజల సంజీవని
ట్రస్ట్ యొక్క సేవలు కేవలం వైద్య సేవలకే పరిమితం కాకుండా కరోనా మహమ్మారి వ్యాపించి ప్రజలు బయటికి రావడానికి భయపడుతున్న విపత్కర పరిస్థితుల్లో ఆహారం అందక అలమటిస్తున్న పేద ప్రజల ఆకలిని తీర్చడానికి ట్రస్టు సభ్యులు 48 రోజులపాటు ప్రతిరోజు స్వయంగా 400 మందికి ఆహారాన్ని సమకూర్చి నేరుగా వ్యాన్ లో ఆహారాన్ని తీసుకువెళ్లి వారికి అందించేవారు.
మేము చేయు సేవలు
సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ వైద్య శిబిరాన్ని నిర్వహించడానికి కాకినాడ అశ్విని హాస్పిటల్స్ అధినేత, అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ అలై డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు గారిని వైద్య సేవలు అందించాలని కోరగా వారు ఈరోజు వరకు కూడా వైద్య సేవలు అందించడమే కాకుండా ట్రస్ట్ చేస్తున్న ప్రతి సేవా కార్యక్రమాల్లో పాల్గొని ట్రస్ట్ సభ్యులకు ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు
ఈ ట్రస్టు స్థాపించిన దగ్గర నుండి నిర్విరామంగా ప్రతి నెల నాలుగవ మంగళవారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించి సుమారు 500 మందికి అనుభవ వైద్యులచే ఉచితంగా మధుమేహ రక్తపోటు పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన మందులను నెలకు సరిపడగా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది.
మాతో కలిసి మీరుకూడా ఈ సేవా కార్యక్రమాలలో పాలుపంచుకోవాలనుకుంటున్నారా?
ఇటీవల మేము చేసిన కొన్ని సేవా కార్యక్రమాలు
Empowering Women: The Sukheebhava Trust’s Impactful Journey
sukheebhavatrust.com/30 June 2023
Empowering Communities: The Impact of Sukheebhava Trust
sukheebhavatrust.com/30 June 2023
Empowering Communities through Sukheebhava Trust: Making a Positive Change Together
sukheebhavatrust.com/30 June 2023